యోగిని ఓడిస్తా.. చరిత్ర తిరగరాస్తా

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పుర్‌లో ఓడించి, 1971 ఎన్నికల నాటి పరిణామాన్ని పునరావృతం చేస్తానని ఆయన ప్రత్యర్థి, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (ఏఎస్‌పీ) అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ చెప్పారు. యోగి కంచుకోటలో ఆయన్ని ఢీకొనడం గురించి ఏమాత్రం భయపడడం లేదని ఒక వార్తాసంస్థకు తెలిపారు.

Published : 28 Jan 2022 04:59 IST

గోరఖ్‌పుర్‌లో ఆయన ప్రత్యర్థి చంద్రశేఖర్‌ ఆజాద్‌

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పుర్‌లో ఓడించి, 1971 ఎన్నికల నాటి పరిణామాన్ని పునరావృతం చేస్తానని ఆయన ప్రత్యర్థి, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (ఏఎస్‌పీ) అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ చెప్పారు. యోగి కంచుకోటలో ఆయన్ని ఢీకొనడం గురించి ఏమాత్రం భయపడడం లేదని ఒక వార్తాసంస్థకు తెలిపారు. 36 చిన్నపార్టీలతో కూడిన ‘సామాజిక్‌ పరివర్తన్‌ మోర్చా’కు ఆయన పార్టీ నేతృత్వం వహిస్తోంది. ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోర్చా ప్రకటించింది. ‘‘1971 ఎన్నికల్లో సిట్టింగ్‌ ముఖ్యమంత్రి టి.ఎన్‌.సింగ్‌ను గోరఖ్‌పుర్‌ ప్రజలు ఓడించారు. గత ఐదేళ్లలో యూపీని, గోరఖ్‌పుర్‌ని ఆదిత్యనాథ్‌ నాశనం చేశారు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయం. విపక్ష ఓట్లు చీలిపోకుండా, సమాజ్‌వాదీ పార్టీతో కలిసి మేం పోటీ చేయాలనుకున్నాం. మాకు తగిన వాటా ఇవ్వడానికి వారు ఇష్టపడకపోవడంతో తిరస్కరించాం. ఎస్పీ పాలనతో విసుగెత్తిన ప్రజలు గతసారి భాజపాను గెలిపించారు. అదే తప్పును వారు మళ్లీ చేయరు’’ అని ఆజాద్‌ చెప్పారు. ఆయన గతంలో భీమ్‌ ఆర్మీని నెలకొల్పారు. దాని రాజకీయ విభాగంగా ఏఎస్‌పీ ఏర్పాటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని