
విద్యావికాసానికి భాజపా అడ్డు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణలో విద్యావికాసానికి మోకాలడ్డుతోందని, గత ఏడేళ్లుగా రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ విమర్శించారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, రాష్ట్రంలో ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా స్పందించలేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఎన్నికైన నలుగురు భాజపా ఎంపీలకు రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ‘‘జిల్లాకో నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉన్నా వాటిని పట్టించుకోకపోవడం దారుణం. రాష్ట్రానికి కొత్త జిల్లాల ప్రాతిపదికన 23 నవోదయ విద్యాలయాల అవసరం ఉంది. విభజన చట్టంలో నిర్దేశించిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపైనా శీతకన్నేసింది. రైతుబీమాపై వైతెపా అధ్యక్షురాలు షర్మిల వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు’’ అని వినోద్‌కుమార్ విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.