సిద్ధూపై ఐఏఎస్‌ పోటీ

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న నవజోత్‌ సింగ్‌ సిద్ధూపై... తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జగ్‌మోహన్‌

Updated : 29 Jan 2022 05:44 IST

ఈనాడు, దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న నవజోత్‌ సింగ్‌ సిద్ధూపై... తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జగ్‌మోహన్‌ సింగ్‌ రాజును భాజపా బరిలోకి దింపింది! అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఆయన... స్వచ్ఛంద పదవీ విరమణకు మంగళవారం దరఖాస్తు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆమోదించింది. ఆ వెంటనే భాజపా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ‘‘స్వరాష్ట్రం పంజాబ్‌లో ప్రస్తుతం బాధాకర పరిస్థితులు ఉన్నాయి. మనస్సాక్షిని అనుసరించి రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు ఆమోదముద్ర వేయండి’’ అని సీఎం స్టాలిన్‌కు రాసిన లేఖలో జగ్‌మోహన్‌సింగ్‌ రాజ్‌ అభ్యర్థించారు. ఇప్పటికే సిద్ధూ, శిరోమణి అకాలీదళ్‌ బిక్రంసింగ్‌ మజీఠియాల మధ్య ఆసక్తికరంగా మారిన పోరు... రాజు రాకతో మరింత రసవత్తరం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని