ట్విటర్‌లో యోగి.. ఫేస్‌బుక్‌లో అఖిలేశ్‌

గతంతో పోలిస్తే ఈ దఫా ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చాలా భిన్నంగా సాగుతున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో.. మునుపటిలా భారీ ర్యాలీలు, లక్షల మంది తరలివచ్చే బహిరంగ సభలు లేవు. అయినప్పటికీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు!

Updated : 29 Jan 2022 11:49 IST

సామాజిక మాధ్యమాల్లో యూపీ నేతల జోరు

లఖ్‌నవూ: గతంతో పోలిస్తే ఈ దఫా ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చాలా భిన్నంగా సాగుతున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో.. మునుపటిలా భారీ ర్యాలీలు, లక్షల మంది తరలివచ్చే బహిరంగ సభలు లేవు. అయినప్పటికీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు! పరిమిత స్థాయిలో ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటూనే.. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను ప్రచార వేదికలుగా చేసుకొని విస్తృత స్థాయిలో ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్వీట్లు, పోస్టులతో రాజకీయ వేడిని పెంచుతున్నారు. మరి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ప్రాబల్యమున్న నేత ఎవరు? వారికి ఆయా వేదికల్లో ఉన్న అనుచరులు (ఫాలోవర్లు) ఎందరు? వంటి వివరాలను పరిశీలిస్తే..  ట్విటర్‌ ఫాలోవర్ల విషయంలో ఇతర నేతలతో పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (భాజపా) ముందంజలో ఉన్నారు. ఈ వేదికపై ఆయన్ను 1.72 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మాత్రం యోగిపై ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ది పైచేయి. అందులో అఖిలేశ్‌కు 75 లక్షల మంది, యోగికి 68 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీలనూ ట్విటర్‌లో లక్షల మంది అనుసరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు