హిజాబ్‌ ధరించిన బాలిక దేశ ప్రధాని అవుతుంది

కర్ణాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిజాబ్‌ వివాదంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరించడాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు

Updated : 14 Feb 2022 06:55 IST

అసదుద్దీన్‌ ఒవైసీ

లఖ్‌నవూ: కర్ణాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిజాబ్‌ వివాదంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరించడాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ‘‘హిజాబ్‌ ధరించాలని బాలికలు నిర్ణయించుకుని, అందుకు వారి తల్లిదండ్రులు మద్దతు ఉంటే.. దీన్ని ఎవరు ఆపుతారో చూస్తాం. హిజాబ్‌, నిఖాబ్‌ ధరిస్తూనే మన బాలికలు డాక్టర్లు, కలెక్టర్లు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు అవుతారు. అందరూ గుర్తుంచుకోండి. బహుశా నేను చనిపోయాక, ఏదోక రోజున హిజాబ్‌ ధరించిన బాలిక ఈ దేశ ప్రధాని అవుతుంది.’’ అంటూ ప్రసంగించారు. ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని