ఉగ్రవాదులంటే ఆ పార్టీలకు సానుభూతి

ఉగ్రవాదులు, జిహాదీ శక్తులంటే దేశంలో కొన్ని పార్టీలకు అపారమైన సానుభూతి అంటూ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లో హర్దోయీ ఎన్నికల ప్రచార సభలో ఉగ్రవాదం

Updated : 21 Feb 2022 04:49 IST

కాంగ్రెస్‌, ఎస్పీలపై మోదీ ధ్వజం

హర్దోయీ (ఉత్తర్‌ప్రదేశ్‌): ఉగ్రవాదులు, జిహాదీ శక్తులంటే దేశంలో కొన్ని పార్టీలకు అపారమైన సానుభూతి అంటూ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లో హర్దోయీ ఎన్నికల ప్రచార సభలో ఉగ్రవాదం అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. జిహాదీ శక్తులకు కాంగ్రెస్‌, ఎస్పీలు అండగా నిలిచాయని ఆరోపించారు. యూపీలో ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో ఉగ్రవాదులపై కేసులు వెనక్కి తీసుకొనే ప్రయత్నాలు జరిగాయని, ఉదాహరణలతో ప్రధాని వివరించారు. ఎస్పీ ప్రయత్నాలను న్యాయస్థానాలు అడ్డుకొని, నిందితులకు భారీ జైలు శిక్షలు విధించాయని తెలిపారు. రెండు రోజుల క్రితం అహ్మదాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో చాలా మంది నిందితులకు ఉరిశిక్ష పడిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ ఘటన తాను గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందని, అప్పుడు ఈ ఘోరానికి పాల్పడిన వారు పాతాళలోకంలో ఉన్నా వెలికితీసి శిక్ష వేయాలని సంకల్పం తీసుకున్నానని చెప్పారు. ఇప్పుడు న్యాయస్థానం వారికి శిక్ష వేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఒకానొక దశలో ముంబయి, జైపుర్‌, బెంగళూరు, హైదరాబాద్‌.. ఇలా దేశవ్యాప్తంగా భారీ సీరియల్‌ బాంబు పేలుళ్లు జరిగాయని, ఇప్పుడు వాటికి అడ్డుకట్ట వేశామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని