రాష్ట్రాల హక్కుల సాధనకు కూటమిగా ఏర్పడాలి: బి.వి.రాఘవులు

రాజకీయాల కోసం కాకుండా రాష్ట్రాల హక్కుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూటమి ఏర్పాటు చేస్తే సమ్మతంగా ఉంటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి

Published : 24 Feb 2022 04:51 IST

మాడ్గులపల్లి, న్యూస్‌టుడే: రాజకీయాల కోసం కాకుండా రాష్ట్రాల హక్కుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూటమి ఏర్పాటు చేస్తే సమ్మతంగా ఉంటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని ఇందుగులలో బుధవారం తెలంగాణ సాయుధపోరాట యోధుడు ముదిరెడ్డి లింగారెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం మాడ్గులపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రతిపక్ష సీఎంలతో కలసి కూటమి ఏర్పాటు చేస్తే విజయం సాధిస్తారని ఆయన అన్నారు. అలా కాకుండా రాజకీయ కూటమి కట్టాలని ప్రయత్నిస్తే.. ప్రతిపక్ష పార్టీల మధ్య వైరుధ్యం పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల తర్వాత బలాబలాలను బట్టి కూటమి ఏర్పాటు మంచిదన్నారు. హక్కుల కోసమైతే ఆప్‌, సీపీఎం, తృణముల్‌, కాంగ్రెస్‌, తెరాస, డీఎంకేలు కలిసొస్తాయని ఆయన చెప్పారు. సమాఖ్య వ్యవస్థపై కేంద్రం దాడి చేస్తోందని, ఆర్థిక, చట్టపరమైన హక్కులను కాలరాస్తోందని, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తోందని రాఘవులు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు