యూపీలో భాజపా గెలుపు కష్టమే

కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం కష్టమేనని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా అభిప్రాయపడ్డారు. వివాదాస్పద సాగుచట్టాల ఉపసంహరణలో

Updated : 03 Mar 2022 05:14 IST

వీహెచ్‌పీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా వ్యాఖ్య

ముంబయి: కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం కష్టమేనని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా అభిప్రాయపడ్డారు. వివాదాస్పద సాగుచట్టాల ఉపసంహరణలో జాప్యం, రైతుల విషయంలో కేంద్రం వైఖరే ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ముంబయిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వివాదాస్పద సాగుచట్టాలను ముందుగానే రద్దు చేసి ఉంటే 700 మంది రైతులు మృత్యువాతపడేవారు కాదు. అప్పుడు యూపీలో గెలుపు సులువయ్యేది. సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గానిస్థాన్‌కు కేంద్రం రూ.20 వేల కోట్లు సాయం చేసింది. సాగుచట్టాలపై పోరాటంలో మృత్యువాతపడ్డ రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇవ్వలేరా? ప్రస్తుతం భాజపాపై ఆగ్రహంగా ఉన్న అన్నదాతల్లో అత్యధికులు.. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసినవారే’’ అని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ తటస్థ వైఖరిని తొగాడియా సమర్థించారు. అయితే- ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చే విషయంలో కేంద్రం జాప్యం చేసిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. హంగరి, రొమేనియాల నుంచి ఉక్రెయిన్‌కు కేంద్ర మంత్రులు బస్సుల్లో వెళ్లి.. విద్యార్థులను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని