పెంచిన ఇంధన ధరలు తగ్గించండి

ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను తగ్గించాలని పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకులతో

Updated : 01 Apr 2022 06:26 IST

 రాహుల్‌ గాంధీ డిమాండ్‌

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు

దిల్లీ: ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను తగ్గించాలని పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకులతో కలిసి దిల్లీలోని విజయ్‌చౌక్‌లో గురువారం ధర్నా నిర్వహించారు. ఇంధన ధరల పెంపు సామాన్యుడికి భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరితో వంటగ్యాస్‌ సిలిండర్లు, ద్విచక్రవాహనాలు వినియోగించే పరిస్థితి లేదంటూ వాటికి పూలమాలలు వేశారు. ‘‘పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ పేద, మధ్యతరగతికి భారంగా మారాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడదే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో పేదల నుంచి డబ్బులు దోచుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తోంది’’ అంటూ రాహుల్‌ నిప్పులు చెరిగారు. అటు పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ ఎంపీలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని