ప్రజల దృష్టిని మళ్లించేందుకే పరస్పర ఆరోపణలు: బక్కని

పెరిగిన ధరల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ధ్వజమెత్తారు.

Published : 06 Apr 2022 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: పెరిగిన ధరల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. 40వ ఆవిర్భావ వేడుకల్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను బక్కని అభినందించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని