Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం బాగుంది: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సంతృప్తి

పార్టీ పునరుత్థానానికి 2024 సాధారణ ఎన్నికల్లో విజయానికి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అందించిన ప్రణాళికపై ఎనిమిది మంది సభ్యుల కాంగ్రెస్‌ కమిటీ తన సలహాలను సూచనలను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించింది.

Updated : 23 Apr 2022 07:54 IST

సోనియాగాంధీకి నివేదిక సమర్పణ

దిల్లీ: పార్టీ పునరుత్థానానికి 2024 సాధారణ ఎన్నికల్లో విజయానికి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అందించిన ప్రణాళికపై ఎనిమిది మంది సభ్యుల కాంగ్రెస్‌ కమిటీ తన సలహాలను సూచనలను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించింది. ఈ కమిటీలో సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, చిదంబరం, ప్రియాంక గాంధీ, జైరామ్‌ రమేశ్‌, ముకుల్‌ వాస్నిక్‌, కేసీ వేణుగోపాల్‌, అంబికా సోని, రణదీప్‌ సూర్జేవాలా ఉన్నారు. వీరు గత కొన్ని వారాలుగా కిశోర్‌ ఇచ్చిన 85 పేజీల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌పై పార్టీలోని పలువురు నేతలతో చర్చించారు. ప్రశాంత్‌ కిశోర్‌తో కూడా భేటీ అయ్యారు. ప్రణాళికపై కమిటీలోని సీనియర్‌ నేతలు చాలావరకు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని తిరిగి అధికారంలో తెచ్చేందుకు కిశోర్‌ వ్యూహం పని చేస్తుందన్న విశ్వాసాన్ని వీరు సోనియాకు సమర్పించిన నివేదికలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరి సిఫార్సుల ఆధారంగా పార్టీలో సంస్థాగత మార్పులపై సోనియా తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరితే అతని అనుభవం అక్కరకొస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని