జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 కింద నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకు ఆంక్షలు ఉన్నాయన్న పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు

Published : 05 May 2022 05:17 IST

రాష్ట్రపతికి మర్రి శశిధర్‌రెడ్డి లేఖ

ఈనాడు, దిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 కింద నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకు ఆంక్షలు ఉన్నాయన్న పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా జమ్మూకశ్మీర్‌లో ఆ ప్రక్రియను చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో తాము కేసు దాఖలు చేశామని, దానిపై నిర్ణయం వెలువడేంతవరకూ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని