మోదీ చేతుల్లో దేశం సురక్షితం: భాజపా

నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం ప్రబలడంతో పాటు ఆర్థిక, సామాజిక పరిస్థితులు క్షీణిస్తున్నాయంటూ ఉదయ్‌పుర్‌ చింతన శిబిరంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలను....

Updated : 14 May 2022 06:12 IST

దిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం ప్రబలడంతో పాటు ఆర్థిక, సామాజిక పరిస్థితులు క్షీణిస్తున్నాయంటూ ఉదయ్‌పుర్‌ చింతన శిబిరంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలను భారతీయ జనతా పార్టీ తిప్పికొట్టింది. ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగానే ఉందని, ఆందోళనచెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సోనియా గాంధీ.. ఆమె పార్టీ భవిష్యత్తు గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలని భాజపా జాతీయ మీడియా ఇన్‌ఛార్జి, ప్రధాన అధికార ప్రతినిధి అనిల్‌ బలూని శుక్రవారం దిల్లీలో అన్నారు. మనుగడ కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజలతో, క్షేత్రస్థాయి శ్రేణులతో సంబంధాలను కోల్పోయిందని తెలిపారు. దేశ భద్రత గురించి తగు నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ప్రధాని మోదీకి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని