కాంగ్రెస్‌కు హార్దిక్ పటేల్ రాజీనామా
గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పాటీదార్ (పటేల్ వర్గం) నేత హార్దిక్ పటేల్ పార్టీలో పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘‘పార్టీలో అగ్రనేతలకు రాష్ట్రంలో, దేశంలో సమస్యల కంటే మొబైల్ ఫోన్లపైనే ఎక్కువ ధ్యాస. వారికి చికెన్
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పాటీదార్ (పటేల్ వర్గం) నేత హార్దిక్ పటేల్ పార్టీలో పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘‘పార్టీలో అగ్రనేతలకు రాష్ట్రంలో, దేశంలో సమస్యల కంటే మొబైల్ ఫోన్లపైనే ఎక్కువ ధ్యాస. వారికి చికెన్ శాండ్విచ్లు సమకూర్చడంపైనే గుజరాత్ కాంగ్రెస్ నేతలకు ఆసక్తి’’ అని రాజీనామా లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. యువ నేత హార్దిక్ రాజీనామా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తీరు గుజరాత్‌ని, గుజరాతీయులను ద్వేషిస్తున్నట్లుగా ఉందని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపిన రాజీనామా లేఖలో హార్దిక్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన భాజపా పాట పాడుతున్నారని, తనపై ఉన్న కేసుల రద్దుకు ఆ పార్టీతో తెరవెనుక మంతనాలు జరుపుతున్నారని గుజరాత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హార్దిక్ భాజపాలో చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!