జయశంకర్‌ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు: మంత్రి ఎర్రబెల్లి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు.

Published : 24 May 2022 04:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. రేవంత్‌ ఎన్నడూ జయశంకర్‌ను కలవలేదని, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సోమవారం విమర్శించారు. ‘‘జయశంకర్‌ మా గురువు. ఆయన సొంతూరు అక్కంపేటను అన్ని విధాలా అభివృద్ధి చేశాం. నాతో వస్తే అది చూపిస్తాను. తెలంగాణ పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? రేవంత్‌ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు’’ అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల కోసం కులాలు, మతాల మధ్య రేవంత్‌ చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి ఆదివారం కర్ణాటకలో జరిగిన సమావేశంలో ఒక కులసంఘం నాయకుడిగా మాట్లాడడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. రేవంత్‌ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు రెడ్లు కావాలో బహుజనులు కావాలో తేల్చుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని