రాష్ట్ర రైతులపై సీఎంది సవతి ప్రేమ

ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఏ ఒక్క రైతు దగ్గరకు వెళ్లని సీఎం కేసీఆర్‌ పంజాబ్‌ రైతుల దగ్గరకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెరాస, భాజపా, మజ్లిస్‌, వైకాపాలు

Published : 25 May 2022 04:47 IST

తెరాస, భాజపా, వైకాపా ఒక్కటే: జగ్గారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఏ ఒక్క రైతు దగ్గరకు వెళ్లని సీఎం కేసీఆర్‌ పంజాబ్‌ రైతుల దగ్గరకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెరాస, భాజపా, మజ్లిస్‌, వైకాపాలు రాజకీయంగా ఒక్కటేనని అన్నారు. మంగళవారమిక్కడ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘పంజాబ్‌లో ఆప్‌, హరియాణాలో భాజపా ప్రభుత్వాలు ఉన్నచోటుకు సీఎం ఎందుకు వెళ్లారు. వ్యతిరేక ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. సొంత రాష్ట్ర రైతులపై సీఎం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు. బతకడానికి ధీమా ఇవ్వకుండా చనిపోతే బీమా ఇస్తున్నారు. ఉచిత కరెంట్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌.. ఆ పథకాన్నే కేసీఆర్‌ కొనసాగిస్తున్నారు. రూ.లక్ష రుణమాఫీకి నాలుగేళ్లు పట్టింది’ అని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని