Published : 29 May 2022 04:49 IST

నెహ్రూ ఫొటో లేకుండా అమృత్‌ మహోత్సవాలా?

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫొటో లేకుండా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు చేయడం ఆక్షేపణీయమని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి దశాబ్దకాలానికిపైగా జైలు జీవితం గడిపిన, నవభారత నిర్మాత నెహ్రూ అని అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో భట్టి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను వక్రీకరించేలా హైదరాబాద్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియంలో అమృత్‌ మహోత్సవాల పేరిట నిర్వహించిన ప్రదర్శనలో నెహ్రూ ఫొటో పెట్టకపోవడాన్ని ప్రశ్నించిన యువజన కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీ మార్పు విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ తదితరులను కూడా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. నెహ్రూ, గాంధీ లేకుండా స్వాతంత్య్ర సంగ్రామం లేదన్నారు. దేశ చరిత్రపై నరేంద్రమోదీ సర్కారుకు ప్రేమలేదని విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నేషనల్‌ ఫ్రంట్‌తో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని భట్టి కీర్తించారు. సామాజిక మార్పునకు కృషిచేసిన ఆ మహానేతకు ఆయన శతజయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నామ న్నారు.

తెరాస నేతలను నిలదీయాలి: దాసోజు శ్రవణ్‌
రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌, తెరాస నేతలను నిలదీయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పార్టీ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో పంజాబ్‌ రైతులను ఆదుకుంటున్నారని, మరి ఇక్కడ ఏమైందని ప్రశ్నించారు.

గుట్ట పునర్‌నిర్మాణ పనులపై దర్యాప్తు చేయాలి  
యాదగిరిగుట్ట పునర్‌నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని పీసీసీ అధికార ప్రతినిధి అయోధ]్యరెడ్డి డిమాండ్‌ చేశారు. నాయకులు అద్దంకి దయాకర్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులతో కలిసి ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని