రాజ్యాధికారం దిశగా పోరాటం: ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

బహుజనులకు రాజ్యాధికారం అందించే దిశగా పోరాటం చేయాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఏకమవ్వాలని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 29 May 2022 04:51 IST

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: బహుజనులకు రాజ్యాధికారం అందించే దిశగా పోరాటం చేయాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఏకమవ్వాలని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన చాకలి ఎస్సీ సాధన సమితి అయిదో వార్షిక మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. చాకలి ఎస్సీ సాధన సమితి చేసే పోరాటానికి తాము పూర్తి మద్దతిస్తామన్నారు. అగ్రవర్ణాల చేతిలో ఉన్న సంపద అందరికీ పంచడానికి బహుజనులు పోరాడాలన్నారు. 20 లక్షల చాకలి జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క చాకలి ఎమ్మెల్యే కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. తమ సమితి ఒక సామాజిక ఉద్యమ సంస్థ అని, ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని