కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా చిదంబరం, జైరామ్‌ రమేశ్‌

వచ్చే నెల 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపింది. పార్టీ

Updated : 30 May 2022 05:39 IST

మొత్తం 10 మంది రంగంలోకి..

గులాంనబీ ఆజాద్‌కు దక్కని అవకాశం

ఈనాడు, దిల్లీ: వచ్చే నెల 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపింది. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నేత ప్రమోద్‌ తివారీలను రాజస్థాన్‌ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేశ్‌కు, మధ్యప్రదేశ్‌ నుంచి వివేక్‌ టంకాలకు అవకాశం కల్పించింది. వీరితోపాటు రాజీవ్‌ శుక్లా (ఛత్తీస్‌గఢ్‌), మాజీ ఎంపీ పప్పూ యాదవ్‌ సతీమణి రంజీత్‌ రంజన్‌ (బిహార్‌), అజయ్‌ మకెన్‌ (హరియాణా), ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి (మహారాష్ట్ర)లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేశ్‌, వివేక్‌ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. మరో సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. పార్టీలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలంటూ 2020లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్‌ నేతల్లో ముకుల్‌ వాస్నిక్‌, వివేక్‌ టంకాలకు రాజ్యసభ అవకాశం లభించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని