GHMC: జలమండలి కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్ల ధర్నా

నగరంలోని ఖైరతాబాద్‌ జలమండలి కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. జలమండలికి రూ.500కోట్లు కేటాయించాలని

Updated : 22 Feb 2022 12:52 IST

పంజాగుట్ట: హైదరాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. జలమండలికి రూ.500కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరారు. ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో మంచినీటి సరఫరా సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జలమండలి ఎండీతో చర్చిస్తామని వారు పోలీసులతో వాదనకు దిగారు. దీంతో ఎనిమిది మంది కార్పొరేటర్లను కార్యాలయం లోపలికి పంపారు. ఎండీ దానకిషోర్‌ లేకపోవడంతో వారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

అంతకుముందు జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి సమస్యలు, పలు చోట్ల కాలుష్య నీరు సరఫరా అవుతోందని భాజపా కార్పొరేటర్లు జలమండలి కార్యాలయం ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. గతంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తత నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జలమండలి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ధర్నాకు అనుమతి లేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని