Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్‌ కొత్త పార్టీ పేరు ఇదే..

కాంగ్రెస్‌తో అయిదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని పార్టీని వీడిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యయాన్ని

Updated : 26 Sep 2022 13:33 IST

జమ్ము: కాంగ్రెస్‌తో అయిదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని పార్టీని వీడిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యయాన్ని మొదలుపెట్టారు. ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ’ పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. జమ్మూలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆజాద్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ పేరుతో పాటు జెండాను కూడా విడుదల చేశారు.

‘‘పార్టీ పేరు కోసం దాదాపు 1500 ప్రతిపాదనలు వచ్చాయి. ప్రజాస్వామ్యం, శాంతి, స్వతంత్రను అద్దం పట్టేలా పార్టీ పేరు ఉండాలని మేం భావించాం’’ అని మీడియా సమావేశంలో ఆజాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా పసుపు, తెలుపు, నీలం రంగుల్లో ఉన్న పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ‘‘పసుపు సృజనాత్మక, ఏకత్వానికి.. తెలుపు శాంతికి.. నీలం స్వేచ్చ, పరిమితుల్లేని పయనానికి ప్రతీక’’ అని ఆజాద్‌ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సరిగ్గా నెలరోజులకు ఆజాద్‌ రాజకీయ పార్టీని ప్రారంభించడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆజాద్‌ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన గులాం నబీ ఆజాద్ గత నెల 26న ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం, అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఆజాద్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌ రాకతోనే పార్టీ పతనం మొదలైందంటూ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని