
‘డర్టీ పాలిటిక్స్ ఇక చాలు.. గోవా మార్పు కోరుతోంది’
పర్యటనకు ముందు కేజ్రీవాల్ ట్వీట్
దిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దృష్టిసారించారు. ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్లలో పర్యటించిన ఆయన.. మంగళవారం గోవా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ‘గోవా మార్పు కోరుతోంది.. చెత్త రాజకీయాలు చాలు’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. గోవా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల్లో పావులు కదుపుతున్న ఆప్.. ఇప్పటికే కార్యచారణను మొదలుపెట్టింది.
‘గోవా మార్పు కోరుకుంటోంది. ఎమ్మెల్యేల క్రయవిక్రయాలు ఇక చాలు. చెత్త రాజకీయాలు ఇక చాలు. గోవా అభివృద్ధి కోరుకుంటోంది. అక్కడ నిధులకు కొరత లేదు.. నిజాయతీకి కొరత ఏర్పడింది. నిజాయతీ కలిగిన రాజకీయాలను గోవా కోరుకుంటోంది. రేపు గోవాలో కలుద్దాం..’’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.