Telangana News: మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంటిపై దాడి

మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్‌ రెడ్డి ఇంటిపై దాడి చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోని కారు అద్దాలు ధ్వంసం చేశారు.

Updated : 03 Mar 2022 15:00 IST

మహబూబ్‌నగర్‌: మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్‌ రెడ్డి ఇంటిపై దాడి చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఆయన ఇంట్లోని కారు అద్దాలు ధ్వంసం చేశారు. గేటు ముందు టైర్‌ను తగులబెట్టారు. దీనికి సంబంధించి సీసీటీవీ పుటేజీని జితేందర్‌రెడ్డి ట్వటర్‌లో పోస్టు చేశారు. దిల్లీలోని తన నివాసంలో కిడ్నాప్‌ ఘటన అనంతరం మహబూబ్‌నగర్‌లో దుండగులు తన ఇంటిపై దాడిచేసి తన వ్యక్తిగత సిబ్బందిని బెదిరించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్‌ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దుండగులపై డీజీపీ, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌లు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నారని, వీరిని జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉన్నట్లు  తేలడంతో అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. జితేందర్‌రెడ్డి డ్రైవర్‌, పీఏ రాజు వీరికి షెల్టర్‌ ఇచ్చారని తెలిపారు. ఈ హత్య కుట్రకు సంబంధించి జితేందర్‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుపుతామని సీపీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. 
 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు