Gorantla Butchaiah Chowdary: తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ సాయాన్ని సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Updated : 14 Jun 2024 16:10 IST

రాజమహేంద్రవరం: ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ సాయాన్ని రూ.3వేల నుంచి రూ.4వేలకు సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధి పైనా తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. అన్న క్యాంటీన్లను కూడా తెరిపిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తప్పులు చేసిన అధికారులను విడిచిపెట్టబోమని, చట్టప్రకారం చర్యలుంటాయని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదు.. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేయిస్తామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని