డీఎంకే ఒప్పుకొంటే కూటమికి సిద్ధం: కమల్‌

మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) పార్టీ నాలుగో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన డీఎంకే ఒప్పుకుంటే కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డీఎంకే రహస్య ప్రతినిధి ఇప్పటికే తమను సంప్రదించారని....

Updated : 23 Feb 2021 04:05 IST

డీఎంకే ప్రతినిధి సంప్రదించాడని పేర్కొన్న ఎంఎన్‌ఎం అధినేత

చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని గతంలో పేర్కొన్న మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తన నాయకత్వంలో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ నాలుగో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన డీఎంకే ఒప్పుకుంటే కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డీఎంకే ప్రతినిధి ఇప్పటికే తమను సంప్రదించారని తెలిపిన కమల్‌ పార్టీ అధిష్ఠానం నుంచి నేరుగా ఆహ్వానం అందితే పొత్తుకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు. 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార అన్నాడీఎంకే, భాజపా కూటమి.. డీఎంకే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎంఎన్‌ఎం పార్టీ కూడా ప్రచారం కొనసాగిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి కమల్‌ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి మరణం తరువాత తమిళనాట జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని