JP Nadda: జేపీ నడ్డా రోడ్‌ షో... భారీగా తరలివచ్చిన భాజపా కార్యకర్తలు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ నుంచి భారీ

Published : 01 Jul 2022 19:25 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో జేపీ నడ్డా రోడ్‌షో నిర్వహించారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో నిర్వహిస్తున్న ర్యాలీకి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దారి పొడవునా పార్టీ జాతీయ అధ్యక్షుడికి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ నడ్డా ముందుకు సాగారు. అంతకుముందు శంషాబాద్‌ విమనాశ్రయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి తదితరులు నడ్డాకు స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని