Andhra News: మంత్రి పదవి హోదా అనుకోను.. సేవలా భావిస్తాను: మంత్రి కాకాణి
మంత్రి పదవి హోదా అనుకోనని, సేవలా భావిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నెల్లూరుకు వచ్చారు.
నెల్లూరు: మంత్రి పదవి హోదా అనుకోనని, సేవలా భావిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. వ్యవసాయరంగ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. మంత్రిగా నెల్లూరు జిల్లాలోని అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని పేర్కొన్నారు. ఎంతో మంది ఆశీర్వాదంతో మంత్రిస్థాయికి వచ్చానన్నారు. అండగా నిలిచిన ప్రతి ఒక్కరి సాయం గుర్తించుకుంటానని తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు.
అంతకుముందు కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి హాదాలో తొలిసారిగా అమరావతి నుంచి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తన కార్యకర్తలతో కలిసి కాకాణికి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణ శివారులోని మద్దూరుపాడు నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ట్రంక్ రోడ్డు మీదుగా భారీగా ఊరేగింపు జరిగింది. అనంతరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లిన కాకాణి.. కార్యకర్తలు, నేతలతో కాసేపు ముచ్చటించారు.
ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఆర్యవైశ్య నాయకులు, వైకాపా కార్యకర్తలు కాకాణికి అపూర్వ స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని వైకాపా కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. వైసీపీ కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికి తమ నేతకు శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్‌కల్యాణ్‌తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!