Rammohan naidu: విశాఖలో రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నలకు ఘన స్వాగతం

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది.

Updated : 17 Jun 2024 15:20 IST

విశాఖ: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో వీరు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరిని నియంత్రించలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి శ్రీకాకుళానికి 200 కార్లు, 350 బైకులతో భారీ ర్యాలీగా వీరు చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని