
AP News: గుడివాడ పర్యటనకు తెదేపా నేతలు.. అడ్డుకున్న పోలీసులు
పామర్రు: కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనకు వెళ్తున్న తెదేపా నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పామర్రు-గుడివాడ రోడ్డు మలుపు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకే వాహనానికి పోలీసులు అనుమతివ్వడంతో తెదేపా నేతలు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు దాటుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడంలో స్వల్ప తోపులాట జరిగింది. తమ పర్యటనను అడ్డుకోవడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం పోలీసులు 10 వాహనాలను అనుమతించారు. దీంతో తెదేపా నిజనిర్ధారణ బృందం గుడివాడలోని తెదేపా కార్యాలయానికి చేరుకుంది.
అంతకుముందు తెదేపా నేతలు పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు యత్నించాయి. తెదేపా బృందం వస్తున్న మార్గంలో నాగవరప్పాడు సెంటర్ వద్దకు చేరుకున్న వైకాపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆ పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.