Gujarat Election 2022: గుజరాత్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ పూర్తయినట్లు చెప్పిన అధికారులు.. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించనున్నారు.

Updated : 01 Dec 2022 19:18 IST

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ పూర్తయినట్లు చెప్పిన అధికారులు.. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించనున్నారు. 19 జిల్లాల వ్యాప్తంగా 89 నియోజవర్గాల పరిధిలో తొలి విడతగా పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 788 మంది అభ్యర్థుల భవితవ్యం ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 3 గంటల వరకు 48.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. మొత్తం పోలింగ్‌ శాతాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. 

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, క్రికెటర్‌ రవీంద్ర జడేజా, అతడి భార్య, జామ్‌నగర్‌ అభ్యర్థి రివాబా జడేజా, కేంద్ర మంత్రులు పురుషోత్తమ్‌ రూపాలా, కాంగ్రెస్‌ దివంగత నేత  అహ్మద్‌ పటేల్‌ కుమార్తె మంధతా సిన్హ్‌ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు చేసింది. తొలిసారిగా కంటెయినర్లతో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంత ప్రజలకు అక్కడికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.

ఎన్నెన్నో ఆసక్తికర ఘటనలు

గుజరాత్‌ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో కొన్ని చోట్ల ఆసక్తిక సంఘటనలు చోటు చేసుకున్నాయి. గ్యాస్‌ ధరల పెరుగుదలకు నిరసనగా..కొందరు పోలింగ్‌ కేంద్రాలకు గ్యాస్‌ సిలిండర్లు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆవుల పెంపకంలోని దుస్థితిని తెలియజేయడం చోసం మాల్దారీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి పోలింగ్‌ కేంద్రానికి ఆవు, దూడతో వెళ్లారు. బోటద్‌ జిల్లాలో ఓ జంట వివాహానికి ముందు పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లి ఓటు వేసింది. రాజ్‌కోట్‌, ఆమ్రేలీ నియోజకవర్గాల్లో చాలా మంది ఆప్‌ కార్యకర్తలు ఓటు వేసేందుకు సైకిళ్లపై వెళ్లారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని