Jignesh Mevani: వివాదాస్పద ట్వీట్‌.. ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ అరెస్ట్‌

ట్విటర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ అరెస్టయ్యారు.

Published : 22 Apr 2022 01:14 IST

అహ్మదాబాద్‌: ట్విటర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ అరెస్టయ్యారు. ఈ కేసు విచారణ నిమిత్తం గుజరాత్‌లోని పాలంపూర్‌ సర్క్యూట్‌ హౌస్‌లో బుధవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అస్సాం పోలీసులు వెల్లడించారు. అస్సాంలోని కోక్రాఝార్‌కు చెందిన అరూప్‌ కుమార్‌ అనే భాజపా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఇటీవలే ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా జిగ్నేశ్‌ మేవానీని అరెస్టు చేసిన పోలీసులు విమానంలో ఈ ఉదయం గువాహటికీ తరలించారు.

నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ జిగ్నేశ్‌ మేవానీ ఏప్రిల్‌ 18న ఓ ట్వీట్‌ చేశారు. అది వివాదాస్పదంగా ఉండడంతో ట్విటర్‌ దాన్ని తొలగించింది. ఇదే విషయంపై అస్సాంకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కోక్రాఝార్‌ పోలీసులు ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర, వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం, శాంతికి భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి అభియోగాలపై జిగ్నేశ్‌ మేవానీపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి అస్సాం పోలీసులు జిగ్నేశ్‌ మేవానీని గుజరాత్‌లో అరెస్టు చేసి తీసుకెళ్లారు.

మండిపడ్డ రాహుల్‌ గాంధీ

రాష్ట్రీయ దళిత్‌ అధికార్‌ మంచ్‌ కన్వీనర్‌గా ఉన్న జిగ్నేశ్‌ మేవానీ గత ఎన్నికల్లో గుజరాత్‌లోని వడ్‌గాం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు  గతేడాది ప్రకటించారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీలోనే చేరాలని తొలుత భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చేరలేకపోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయన అరెస్టును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. వాస్తవాలు చెప్పే గొంతుకను అణచివేయలేరంటూ భాజపాపై మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని