Gujarat: 20లక్షల ఉద్యోగాలు.. KG-PG ఉచిత విద్య: గుజరాత్‌కు భాజపా వరాల జల్లు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా హామీల వర్షం కురిపించింది.
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతోన్న వేళ.. ప్రచార జోరు పెంచిన భారతీయ జనతా పార్టీ శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గుజరాత్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఉచితాల జోలికి పెద్దగా వెళ్లని భాజపా.. అభివృద్ధే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపింది. తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది.
గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర భాజపా చీఫ్ సీఆర్ పాటిల్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉగ్రముప్పు నుంచి రాష్ట్రానికి భద్రత కల్పించేలా యాంటీ-రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు, రెండు ఎయిమ్స్ సహా కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ వంటి హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది.
భాజపా మేనిఫెస్టోలో ప్రధానాంశాలివే..
* ఉమ్మడి పౌరస్మృతి అమలు, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు
* ఉగ్రముఠాల స్లీపర్‌సెల్స్‌ను గుర్తించి నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్
* వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
* రూ.10వేల కోట్లతో రైతులకు మౌలికసదుపాయాల కల్పన
* మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు
* విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* రూ.10వేల కోట్లతో రాష్ట్రంలోని 20వేల ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి
* ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు పెంపు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్
-
Politics News
KVP: జగన్‌కు ఎందుకు దూరమయ్యానో త్వరలోనే చెప్తాను : కేవీపీ