రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి: మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాలని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated : 30 Jan 2023 14:07 IST

హైదరాబాద్‌: రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాలని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచిబుద్ధి కలగాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపని నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహం వద్ద మండలి ఛైర్మన్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీ లేని లోటు కనిపిస్తోందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగానికి ఆటంకాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న సమాఖ్య వ్యవస్థ, లౌకిక విధానాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని హితవు పలికారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలో అమలు చేస్తోంది సీఎం కేసీఆర్‌ ఒక్కరేనన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయని చెప్పారు. కేంద్రం కొన్ని విషయాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ వాస్తవాలు దాచుకోలేకపోతోందని పోచారం వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు