AP News: బద్వేలు ఉప ఎన్నికలో భారీగా రిగ్గింగ్‌: జీవీఎల్‌

బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఉప ఎన్నికలో భారీగా రిగ్గింగ్‌ జరిగిందని, వైకాపా

Updated : 31 Oct 2021 17:19 IST

కడప: బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఉప ఎన్నికలో భారీగా రిగ్గింగ్‌ జరిగిందని, వైకాపా ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసులు కూడా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునల్‌ దేవ్‌ధర్‌తో కలిసి జీవీఎల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.  ‘‘పక్క నియోజకవర్గాల నుంచి అద్దె ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికల్ని అపహాస్యం చేసే విధంగా వైకాపా వ్యవహరించింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు బద్వేలులో తిష్టవేసి దొంగ ఓట్లు వేయించారు. నిన్న జరిగిన పోలింగ్‌లో కనీసం  50 నుంచి 60వేలకు తగ్గకుండా దొంగ ఓట్లు వేయించుకున్నారు. బద్వేలులోని 28 పోలింగ్‌ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, పరిశీలకులు ప్రేక్షకపాత్ర వహించారు. అక్రమాలు జరిగిన చోట్ల రీపోలింగ్‌ జరపాలని ఈసీని కోరాం’’ అని జీవీఎల్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని