దివ్యాంగుడిని స్టేజిపై నుంచి లాగేసిన నేత..!

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో నిర్వహించిన తెరాస ధూం ధాం కార్యక్రమం వేదికపై.. తనకు పింఛన్ రావడం లేదంటూ మడుపు రాజేష్ అనే దివ్యాంగుడు

Updated : 12 Oct 2022 14:29 IST

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో నిర్వహించిన తెరాస ధూం ధాం కార్యక్రమం వేదికపై.. తనకు పింఛన్ రావడం లేదంటూ మడుపు రాజేష్ అనే దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. స్టేజీపైకి వచ్చిన అతడిని కిందికి లాగేసేందుకు ప్రయత్నించగా.. అతడు కింద పడిపోయాడు. అంతకుముందు ప్రజాప్రతినిధులను కలిసేందుకు ప్రయత్నించినా.. పోలీసులు అనుమతించకపోవడంతో కార్యక్రమం ముగిశాక చివరగా స్టేజి ఎక్కి తన ఆవేదన వెలిబుచ్చాడు. పింఛన్ రావడం లేదని చెబుతుండగా నేత ఒకరు అతడిని లాగేయడంతో రాజేష్ కిందపడిపోయాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని