
Hardik Patel: హిందువులంటే ఎందుకంత ద్వేషం.. కాంగ్రెస్‌పై మండిపడ్డ హార్దిక్ పటేల్
గాంధీనగర్: ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన గుజరాత్ పాటిదార్ నేత హార్దిక్ పటేల్ ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా హిందువులంటే కాంగ్రెస్ నాయకులకు ఎందుకంత ద్వేషం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హిందువులు, అయోధ్య రాముడిపై గుజరాత్ కాంగ్రెస్ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలపై హార్దిక్ పటేల్ తీవ్రంగా మండిపడ్డారు.
‘ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఇదివరకే చెప్పాను. ముఖ్యంగా హిందువుల విశ్వాసాలను కించపరిచేలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు రామమందిర ఇటుకల విషయంలోనూ కేంద్ర మాజీమంత్రి, గుజరాత్ కాంగ్రెస్ నేత అపవిత్రంగా మాట్లాడారు’ అని హార్దిక్ పటేల్ పేర్కొన్నారు. ‘రామమందిరం నిర్మాణానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు వ్యతిరేకమా..? అని ఈ సందర్భంగా అడగదలచుకున్నా. హిందువులంటే ఎందుకంత ద్వేషం..? ఎన్నో శతాబ్దాల తర్వాత అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంటే వాటిపైనా కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు’ అంటూ దుయ్యబట్టారు. అయోధ్య రామమందిరం నిర్మాణం జరుగుతోన్న వేళ అక్కడి ఇటుకలపై శునకాలు విసర్జిస్తున్నాయంటూ గుజరాత్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై హార్దిక్ పటేల్ ఈ విధంగా స్పందించారు.
ఇదిలాఉంటే, పాటిదార్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం కీలక బాధ్యతల్లో కొనసాగారు. అయితే, గతకొంత కాలంగా పార్టీ తనను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇటీవల పార్టీని వీడారు. అనంతరం భాజపా లేదా ఆమ్ఆద్మీలో చేరతారని భావిస్తున్నప్పటికీ.. ఏ పార్టీలో చేరే అంశంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇటీవలే స్పష్టం చేశారు. ఇలా పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న హార్దిక్ పటేల్.. ఆయన మాదిరిగా కాంగ్రెస్‌లో ఎంతోమంది అసంతృప్తిలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలా గుజరాత్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
-
Politics News
Priyanka Chaturvedi: రాజకీయ సంక్షోభంపై బెదిరింపు కాల్స్.. పోలీసులను ఆశ్రయించిన శివసేన ఎంపీ
-
General News
Health: తరచుగా జబ్బుల బారిన పడుతున్నారా..? కాలేయం ఎలా ఉందో తెలుసుకోండి
-
Politics News
Maharashtra Crisis: ఏక్నాథ్ శిందేకి సపోర్టు చేయడానికి కారణం అదే..: రెబల్ ఎమ్మెల్యే
-
Politics News
Janasena: దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి కల్పించాలి: నాగబాబు
-
General News
Health: పిల్లలకు అవసరమైతేనే శస్త్రచికిత్స
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి