Harish Rao: హామీ మేరకు 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

Updated : 17 Jun 2024 14:33 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. భారాస కార్యాలయానికి గ్రూప్స్‌ అభ్యర్థులు వచ్చి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 చొప్పున పోస్టులు తీయాలని అభ్యర్థులు కోరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు 1:100 చొప్పున తీయాలని యువతను రెచ్చగొట్టారని విమర్శించారు. ఇప్పుడు ఆ ప్రకారం ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు.

‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నేతలు గ్రూప్స్‌ పోస్టులు పెంచాలని అడిగారు. ఇప్పుడు పోస్టులు పెంచాలని అభ్యర్థులు కోరితే స్పందించట్లేదు. గ్రూప్స్‌లో పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాలని మా వద్దకు వచ్చి కోరారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారు? మెగా డీఎస్సీ కింద 25 వేల ఉద్యోగాలు ఇస్తామని 11 వేలతో సరిపెట్టారు. హామీ మేరకు 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని