Telangana News: సైన్యాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నం: హరీశ్‌రావు

అగ్నిపథ్‌ విధానం యువతకు అర్థం కాలేదని కేంద్రం అనడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 18 Jun 2022 14:04 IST

నిజామాబాద్: అగ్నిపథ్‌ విధానం యువతకు అర్థం కాలేదని కేంద్రం అనడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్ మండలం మోతెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశమంతా అట్టుడుకుతోందని.. భాజపా ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. సైన్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.

సికింద్రాబాద్‌ అల్లర్లను తెరాస చేయించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారన్నారు. సికింద్రాబాద్‌లో తెరాస చేయిస్తే.. మరి యూపీలో పోలీస్ స్టేషన్ పైనే దాడి జరిగిందన్నారు. అలా అయితే.. యూపీలో యోగి, బిహార్‌లో నితీష్ అల్లర్లు చేయించారా? అని ప్రశ్నించారు. ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని