Harish Rao: ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం: హరీశ్‌రావు

తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం అని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు.

Updated : 19 Jun 2024 10:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. 

422 జూనియర్ కళాశాలల్లో 1.60 లక్షల మంది పేద, బలహీన వర్గాల వారు చదువుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని.. జూనియర్ కళాశాలల్లో ఉన్న 1,654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ విద్యార్థులకు వెంటనే  పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు