Harish Rao: ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్‌, తీన్మార్‌ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Published : 30 Jun 2024 14:19 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్‌, తీన్మార్‌ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని.. ధర్నాలు చేస్తున్న గ్రూప్స్‌ అభ్యర్థులకు మాత్రం రాలేదని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ను ఆయన పరామర్శించి మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మోతీలాల్‌ నాయక్‌ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగిస్తోందన్నారు. అశోక్‌నగర్‌లో హామీ ఇచ్చిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ సహా హామీలు తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మోతీలాల్‌ ప్రాణానికి హాని కలిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని హరీశ్‌రావు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని