Telangana News: మోదీ, అమిత్‌ షా తిట్టడం తప్ప తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం లేని అవార్డులు లేవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అవార్డులు....

Updated : 01 Jun 2022 19:39 IST

సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం లేని అవార్డులు లేవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అవార్డులు రావడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 8,995 కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేంద్రానికి లేఖ రాసి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఇదంతా రాష్ట్ర ప్రజల హక్కుగా రావాల్సిన డబ్బు అని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం చెప్పినా నిధులు ఇవ్వరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా తిట్టడం మినహా తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని