
Harish Rao: అక్కలారా.. ఓటేసేందుకు వెళ్లేటప్పుడు జర సిలిండర్‌కు దండం పెట్టిపోండి!
హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. అధికార తెరాస తరఫున మంత్రులు, ఇతర నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేసిన మంత్రి హరీశ్‌రావు లక్ష్మాజీపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపా హయాంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
‘‘ఈటల రాజేందర్ ఆరుసార్లు గెలిచారు.. ఆయనకు వ్యాపారం కూడా ఉంది. ఇక్కడి నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహించినా ఈటల ఏమీ చేయలేదు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు రెండేళ్లు అవకాశం ఇవ్వండి. పని చేయించి చూపిస్తా. భాజపా గెలిస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కరెంటు మీటర్లు తిరిగినట్టు తిరుగుతాయ్. అలా పెరగాలా..? తెరాస గెలిచి పేద ప్రజల సంక్షేమం కొనసాగాలా? ఆలోచించి ఓటేయండి. ఈ నెల 30న ఓటేసేందుకు పోయేటప్పుడు అక్కాచెల్లెళ్లు ఒక్కసారి వంటగదిలోకి పోయి సిలిండర్‌కు దండం పెట్టి వెళ్లండి. యువత కష్ట పడి పనిచేయాలి.. భవిష్యత్తు మనదే’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.