Harish Rao: నీతి ఆయోగ్‌ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోంది: హరీశ్‌రావు

నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా

Updated : 07 Aug 2022 16:16 IST

హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపాకు వంతపాడుతూ నోట్‌ రిలీజ్‌ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. నీతిఆయోగ్‌ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదంటూ నీతిఆయోగ్‌ తప్పుడు ప్రకటన చేసిందని ఆయన ఆరోపించారు. నీతి ఆయోగ్‌ పూర్తిగా వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని.. సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆ ప్రకటన చేసిందని విమర్శించారు.
 
ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు ఇవ్వాల్సింది పోయి కేంద్రం చేసే తప్పులను కప్పిపుచ్చేలా నీతి ఆయోగ్‌ ప్రకటన ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. పనిచేయని రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు చేస్తున్నారని.. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ఎందుకు చేయరని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకని మంత్రి నిలదీశారు. ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి నీతిఆయోగ్‌ ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ, వాజ్‌పేయీ, మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయని హరీశ్‌రావు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు