Rahul Gandhi: ఆ విషయం అర్థంకాగానే ‘కెప్టెన్‌’ని తప్పించాం: రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని విపక్షాలపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఒకరిద్దరు బిలియనీర్లకు లబ్ధిచేకూర్చేది కాదనీ.. .....

Published : 15 Feb 2022 15:06 IST

పటియాలా: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని విపక్షాలపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఒకరిద్దరు బిలియనీర్లకు లబ్ధిచేకూర్చేది కాదనీ.. తమది రైతుల పక్షపాత ప్రభుత్వమన్నారు. ఎప్పుడూ రైతుల పక్షానే నిలబడతామన్నారు. మంగళవారం పటియాలా జిల్లా రాజ్‌పురలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ప్రసంగించారు. పంజాబ్‌ లోక్‌కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఓ పేద వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అంటూ ప్రజల్ని రాహుల్ అడిగారు. భాజపాతో అమరీందర్‌ సింగ్‌ సంబంధాలు గురించి తమకు అర్థమైన రోజే ఆయన్ను తొలగించామని వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోదీ చిన్న, మధ్యతరహా వ్యాపారులు, రైతుల్ని దెబ్బతీశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిరుద్యోగం రోజురోజుకీ పెరగడంతో యువత తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. 

పంజాబ్‌ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదనీ.. దేశానికి ఆత్మలాంటిందన్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పటికీ ద్వేషాన్ని వ్యాప్తిచేయలేరని తెలిపారు. పంజాబ్‌లో విభజన వస్తే రాష్ట్రం బలహీనపడిపోతుందని హెచ్చరించిన రాహుల్.. ప్రజలంతా ఐక్యతతో రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తాను తప్పుడు  హామీలు ఇవ్వనన్నారు. తప్పుడు హామీలు ఎవరైనా కోరుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ, బాదల్‌, కేజ్రీవాల్‌ మాటలు వినుకోవచ్చన్నారు. తనకు మాత్రం కేవలం నిజాలు చెప్పడమే తెలుసన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని