Chandrababu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభం

తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. 

Updated : 03 Oct 2023 13:00 IST

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్‌ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్‌ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమన్నారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశంమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని