Mahanadu: మహానాడు బహిరంగ సభ వద్ద భారీ వర్షం.. తడిసి ముద్దయిన కార్యకర్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కడియం మండలం వేమగిరిలో తెదేపా మహానాడు సభా ప్రాంగణం వద్ద వర్షం బీభత్సానికి కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు.

Updated : 28 May 2023 18:51 IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కడియం మండలం వేమగిరిలో తెదేపా మహానాడు సభా ప్రాంగణం వద్ద వర్షం బీభత్సానికి కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు. వర్షంలో తడుస్తూనే నేతల ప్రసంగాలు విన్నారు. భారీ వర్షం, ఈదురు గాలులతో మహానాడు సభా ప్రాంగణం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. భారీ ఈదురు గాలులకు నేతల కటౌట్‌ ఒక్కసారిగా వీఐపీ టెంట్‌పై పడటంతో నేలకొరిగింది.

తెదేపా నేతలకు తప్పిన ప్రమాదం..

అప్పటి వరకు అదే టెంట్‌లో నారా లోకేశ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్‌ గజపతిరాజు, పంచుమర్తి అనురాధ, బాలవీరాంజనేయులు ఇతర ముఖ్యనేతలు ఉన్నారు. వీరందరూ బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఎన్టీఆర్‌ కటౌట్‌ పడి వీఐపీ టెంట్‌ నేలకొరిగింది. వర్షంలోనూ నేతల ప్రసంగాలు కొనసాగించారు. తడవకుండా కార్యకర్తలు తలపై కుర్చీలు అడ్డుపెట్టుకొని సభను వీక్షించారు. వర్షం కారణంగా సభా ప్రాంగణం, మైదానంలో ఉన్న ఎల్‌ఈడీలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను ముందస్తు జాగ్రత్తగా సిబ్బంది తరలించారు. చంద్రబాబు రాజమహేంద్రవరం నుంచి సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొంత ఆలస్యంగా సభా వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు. వేమగిరి కూడలి వద్ద తెదేపా కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నెలకొంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేల సంఖ్యలో కార్యకర్తలు బహిరంగ సభకు తరలి వచ్చారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు