Andhra News: కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీజీహెచ్‌కు వచ్చిన తెదేపా నిజనిర్ధరణ బృందం.. మార్చురీ గది వద్దకు వెళ్లేందుకు

Updated : 21 May 2022 15:19 IST

కాకినాడ: కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా ఏర్పాటు చేసిన నిజ నిర్ధరణ బృందం జీజీహెచ్‌కు వచ్చి.. మార్చురీ గది వద్దకు వెళ్లేందుకు యత్నించింది. దీంతో పోలీసులు బృందాన్ని అడ్డుకున్నారు. బారికేడ్లు తోసుకొని తెదేపా నేతలు ముందుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

తెదేపా నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు గాయపడ్డారు. దీంతో ఆయన్ను జీజీహెచ్‌లోకి తీసుకెళ్లి వైద్యం అందించారు. మరోవైపు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేసే వరకూ తాము సంతకం చేయబోమని అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. పోస్టుమార్టం నిలిచిపోయింది.

మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు: పోలీసులు

‘‘ఈ కేసులో మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. శవపంచనామా జరిగితేనే దర్యాప్తు సాగుతుంది. శవపంచనామాకు కుటుంబసభ్యులు సంతకాలు పెట్టాలి. అనుమానాలు మా వద్ద చెప్పాలని కోరుతున్నాం. పోస్టుమార్టం జరిగేలా సహకరించాలని కోరుతున్నాం’’ అని పోలీసులు తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని