Amit Shah: నిర్మల్‌ భాజపా బహిరంగ సభకు నేడు అమిత్ షా 

నిర్మల్‌లో భాజపా నేడు తలపెట్టిన బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వస్తున్నారు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి విమానంలో బయలుదేరి 11.30 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌ విమానాశ్రయంలో దిగుతారు.  

Updated : 17 Sep 2021 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపా నేడు నిర్మల్‌లో తలపెట్టిన బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వస్తున్నారు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి విమానంలో బయలుదేరి 11.30 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌ విమానాశ్రయంలో దిగుతారు. నాందేడ్‌లోని పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం మధ్యాహ్నం 1.50 గంటలకు నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి 2.30 గంటలకు నిర్మల్ చేరుకుంటారు.  మధ్యాహ్నం 2.45 గంటలకు నిర్మల్ సభా ప్రాంగణంలో మోదీ జన్మదినం సందర్భంగా భాజపా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు. అనంతరం సర్ధార్‌ పటేల్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.50 గంటల వరకు నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హెలికాఫ్టర్‌లో నాందేడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి 5.45 గంటలకు దిల్లీ పయణమవుతారు. 

 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని