గుజరాత్‌లో గత రికార్డులు బ్రేక్‌ చేస్తాం.. కేంద్రంలోనూ 400 సీట్లు గెలుస్తాం: ఠాకూర్‌

గుజరాత్‌(Gujarat)లో పెద్ద ఎత్తున భాజపా గాలి వీస్తోందని, గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఈసారి కూడా అక్కడ తిరిగి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) ధీమా వ్యక్తంచేశారు.

Published : 16 Oct 2022 17:23 IST

దిల్లీ: గుజరాత్‌(Gujarat)లో పెద్ద ఎత్తున భాజపా గాలి వీస్తోందని, గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఈసారి కూడా అక్కడ తిరిగి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) ధీమా వ్యక్తంచేశారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలోనూ మళ్లీ నరేంద్ర మోదీ(Narendra Modi) సారథ్యంలోని భాజపా 400లకు పైగా సీట్లు గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లా మాల్వన్‌లో నిర్వహించిన ‘భాజపా గౌరవ్‌’ యాత్రలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలో హిందూ చిహ్నాలకు గౌరవం లభించడమే కాకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైందన్నారు. గతంలో ఒక ఇటలీ మహిళ ప్రధాని మోదీని అవమానించారని.. ఇప్పుడు ఒక ‘ఇటాలియా’ మోదీ తల్లిని అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆప్‌ నేత గోపాల్‌ ఇటాలియాల పేర్లను ప్రస్తావించకుండా పరోక్షంగా మండిపడ్డారు. ఇలాంటి అవమానాలను గుజరాత్‌ గతంలో అంగీకరించలేదని.. అక్కడి ప్రజలు ఇప్పుడూ ఇలాంటివి ఆమోదించరని.. తగిన సమాధానం చెబుతారని ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని