
Huzurabad By Election: ప్రైవేట్ వాహనంలో ఈవీఎం తరలిస్తుండగా పట్టివేత
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంను ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు పట్టుకున్నారు. ఈవీఎంలు భద్రపరుసున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వద్ద కాంగ్రెస్, భాజపా శ్రేణులు వాహనాన్ని అడ్డుకున్నాయి. ఈవీఎంను ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రైవేట్ బస్సులో తరలించడంపై పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ వాహనాన్ని అడ్డుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బస్సు పంక్చర్ కావడంతో జమ్మికుంట వద్ద ఆపారంటూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను కాంగ్రెస్, భాజపా నాయకులు ఎన్నికల కమిషనర్‌కు పంపారు. ఈవీఎంను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.